/rtv/media/media_files/2025/03/01/QS2txJB5HYf5gpXK5pXe.jpg)
Trapped the young man
Trapped the young man : ఈ మధ్య అక్రమసంబంధాలతో భర్తలను హత్య చేస్తోన్న ఆడవారి సంఖ్య ఎక్కువైంది. భర్త వదిలించుకోవడానికి అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తర్వాత పర్యావసనాలు ఎటు దారితీస్తాయో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అయితే ఇది దీనికి కొంత భిన్నమైన కథనం. ఆల్రెడీ పెళ్లైన వారు తమ తోడును వదిలేసి కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్త, భార్యను వదిలేయడం, భార్య భర్తను వదిలి వెళ్లడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల ఓ వివాహిత 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసింది. భర్తను పిల్లలను వదిలేసి ప్రియుడి కోసం నగరానికి చేరుకుంది.
Also Read : ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతు .. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా
ఇక్కడ విచిత్రం ఏంటంటే వారిద్దరికీ ముఖ పరిచయం లేదు. ఫోన్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది ప్రియుడి మోజులో పడి భర్త పిల్లలను వదిలేసి అతనితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిపై నిఘా పెట్టి భైక్ పై వెల్తున్న ఇద్దరిని అడ్డగించాడు.. దీంతో భైక్ ను వదిలేసి వారిద్దరూ పరారయ్యారు.ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది.
Also read : తెలుగు రాష్ట్రాల్లో 14 రోజులు బ్యాంకులు బంద్
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కు చెందిన మిరియం పల్లి పేరయ్య కుమారుడు గోపి అనే యువకుడు కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫోన్ యాప్ లో గోపికి వరంగల్ జిల్లా బావోజిగూడెం కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన సుకన్య (35) పరిచయం అయింది. వీరు తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వారు.. ఇది గమనించిన భర్త జయరాజ్ సుకన్యను మందలించాడు.
Also Read : మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?
ఈక్రమంలో సుకన్య భర్త పిల్లలను వదిలి గోపిని కలవడానికి నగరానికి వచ్చింది. ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది. నెల రోజులుగా యువకుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు ఫోన్లను స్విచ్చాప్ చేశారు. చివరిసారిగా బైక్ పై వెళ్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also read : అంతా తూచ్.. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా : సీఐ సంచలన ప్రకటన