/rtv/media/media_files/2025/04/01/BSXULExA5aulTIPpvUTO.jpg)
Martial Arts
Martial Arts: రాజకీయాలతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాణిస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ black belt సాధించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. గ్రాండ్ మాస్టర్ ఎస్.శ్రీనివాసన్ ఆయనకు బెల్ట్‌ను ప్రదానం చేశారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో వైడబ్ల్యూసీఏలో జరిగిన కరాటేలో మూడు గంటల పాటు సాగిన నైపుణ్య పరీక్షలో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయనకు ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ధ్రువపత్రాన్ని అందజేశారు.
Also Read: UPI సేవలు బంద్.. UPI సేవలు బంద్.. స్టేట్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన!
ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ తన జీవితంలో కరాటే ఒక భాగంగా చెప్పారు. అంతేకాదు.. 2027లో హైదరాబాద్ మహానగరంలో ఆసియా కరాటే పోటీల్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను ఒక కంప్యూటర్ కిడ్స్ మాదిరి తయారు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు.క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని.. శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు.
Also Read: టీవీ నటితో హార్దిక్ పాండ్యా డేటింగ్.. బయటపడ్డ సంచలన వీడియో!
కాగా, మహేష్ కుమార్ గౌడ్‌కు కరాటేలో మంచి పేరు తెచ్చుకున్నారు. 2006లో ఆయన 6వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కరాటేలో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఇక ఇటీవల నాలుగో నేషనల్ కియో కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కరాటే అసోసియేషన్ తరఫున బ్లాక్ బెల్ట్ ప్రధానం చేశారు.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. చూసినంతనే టిప్ టాప్ గా ఉంటే.. ఫిట్ అన్నట్లుగా కనిపించే చాలామంది రాజకీయ ప్రముఖులకు బోలెడన్ని అనారోగ్య అంశాలు ఉంటాయి. అందుకు భిన్నంగా అరవైఏళ్లకు దగ్గరకు వచ్చేసిన మహేశ్ కుమార్ మాత్రం ఫిట్ గా ఉండటమే కాదు.. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో తన సత్తా చాటటానికి మించిన స్పెషల్ ఇంకేం ఉంటుంది. ఇప్పటివరకు మహేశ్ కుమార్ కు ఉన్న ఇమేజ్ ను తాజా అంశం డబుల్ చేస్తుందని చెప్పక తప్పదు.
ఇది కూడా చూడండి: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!