అవినీతికి అదుపు లేదు.. కేసీఆర్‌కు మహేష్ గౌడ్ బహిరంగ లేఖ

TG: కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ పాలనలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్నే పదవులు వరించాయని విమర్శించారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత BRSకు లేదన్నారు.

New Update
mahesh kumar goud

Mahesh Kumar Goud: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు విమర్శిస్తూ బహిరంగ లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. గతంలో మీరు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు, మీ పార్టీ.. చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో  కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి, మీరు చేసిన ఆరాచకాన్ని ప్రజలు ఎన్నటికీ మరవలేరని అన్నారు.

డౌన్లోడ్ లెటర్ 

Also Read: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల

ముఖ్యమంత్రిగా దళితుడిని...

మహేష్ కుమార్ గౌడ్ లేఖలో.. "నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు. నీళ్లు, నిధులు, నియామకాలు  నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా సబ్బండవర్ణాలు ప్రాణాలకు తెగించి పోరాడగా, అధికారంలోకి రాగానే మీరు తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి, మీరు చేసిన ఆరాచకాన్ని ప్రజలు ఎన్నటికీ మరవలేరు. 

Also Read: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు!

రాష్ట్రానికే గుండెకాయలాంటి సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కీ పరిమితమై పాలన సాగించడంతో మీ హయాంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. మీ పెత్తందారు సర్కార్తో విసిగిపోయిన ప్రజలు మీ పాలనకు చరమగీతం పాడినా మీలో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ ఏర్పాటుకు పోరాడిరది సబ్బండ వర్గాలైతే, ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించిన ప్రజలు మాకు అధికారం కట్టబెడితే ఓర్వలేక మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు ఇదే పంథాలో సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం." అని లేఖలో పేర్కొన్నారు.

Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు

Also Read: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు