/rtv/media/media_files/2026/05/25/summer-2026-05-25-10-07-12.jpg)
Sunstroke in Telangana
sunstroke : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తోడు వడగాడ్పులు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. గత మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 100 మందికి పైగా మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బతో మరణించిన వడదెబ్బ కారణంగా 100 మందికి పైగా మరణించడంఅయితే, ఈ పరిహారం లభించాలంటే కొన్ని కఠినమైన ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
వడదెబ్బ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల ఆర్థిక సాయం అందాలంటే, బాధితుల కుటుంబ సభ్యులు ఈ క్రింది ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది:
తక్షణ సమాచారం: ఎవరైనా ఎండదెబ్బతో మరణిస్తే, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. దాంతో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బందికి (VRO/MRO), ఆశా వర్కర్ లేదా ఏఎన్‌ఎం (ANM), గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) సిబ్బందికి సమాచారం అందించాలి. మరణానికి గల అసలు కారణం వడదెబ్బేనని నిర్ధారణ కావడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి ఖచ్చితంగా పోస్టుమార్టం నిర్వహించాలి. మరణం సంభవించిన రోజున ఆ నిర్దిష్ట ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల కంటే ఎక్కువ (తీవ్రమైన స్థాయిలో) నమోదై ఉండాలి.
ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ
సమాచారం అందిన తర్వాత మండల రెవెన్యూ అధికారి (MRO), వైద్యాధికారి (డాక్టర్), స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సంయుక్తంగా విచారణ జరుపుతుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపి, పరిహారంపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
రోళ్లు పగిలే ఎండలు.. 'రోహిణి' మొదలు
రాష్ట్రంలో ఎండలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరాయి. జగిత్యాల జిల్లా బుద్దేశ్‌పల్లిలో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి తోడు నేటి (సోమవారం) నుంచి "రోహిణి కార్తె" ప్రవేశిస్తుండటంతో జనం మరింత బెంబేలెత్తుతున్నారు. ‘రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి’ అన్న సామెత నిజం చేస్తూ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. సోమ, మంగళవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఎల్లో/ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలు మండుతున్నప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు (రక్షణ చర్యలు)
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ఎండలో పనిచేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేయకపోయినా తరచూ మంచి నీళ్లు తాగాలి.ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అనవసరంగా బయట తిరగవద్దు. లవణాలు లభించేలా మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ నీరు తీసుకోవాలి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. తేలికపాటి, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎక్కువ నూనె, మసాలాలు ఉన్న భారీ ఆహారాన్ని తీసుకోకూడదు.బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, కళ్లద్దాలు వాడాలి.* ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో సుదూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్స
ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు (కళ్లు తిరగడం, స్పృహతప్పడం, తీవ్ర జ్వరం, ఒళ్లు వేడెక్కడం) కనిపిస్తే వెంటనే వారిని నీడ ఉన్న చల్లటి ప్రదేశానికి తరలించాలి. తడి గుడ్డతో శరీరాన్ని తూడుస్తూ, వీలైనంత ఎక్కువ నీరు తాగించాలి. పరిస్థితి విషమించకముందే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి.
Follow Us