పండుగ పూట ఇదేం దోపిడీ సారూ..? వైరల్ అవుతోన్న RTC బస్ టికెట్ల ఫొటోలు! దసరా, బతుకమ్మ ఫెస్టివల్ సీజన్లో బస్ టికెట్ల ధరలను పెంచి ప్రయాణికులకు దోచుకున్నారంటూ ఆర్టీసీపై ప్రయాణికులకు బగ్గుమంటున్నారు. టికెట్ల ఫొటోలను షేర్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతలా దోచుకుంటారా? అంటూ భగ్గుమంటున్నారు. By Nikhil 14 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి దసరా పండుగ వేళ టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చింది. స్పెషల్ బస్సులు అన్న సాకుతో టికెట్ రేట్లను ఇష్టారీతిగా పెంచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల కొద్దీ ధరను పెంచడం ఏంటని ఫైర్ అవుతున్నారు. టికెట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. TGSRTCతో పాటు సంస్థ ఎండీ సజ్జనార్ ను ట్యాగ్ చేస్తూ ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: CM Revanth: తెలంగాణకు మరో సంచలన అధికారి.. రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా? అప్పుడు రూ.300 ఉంటే ఇప్పుడు రూ.420.. దసరా, బతుకమ్మ పండుగ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. దీంతో ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే.. పండుగ వేళ రూ.420కి పెంచారని ఒకరు పోస్ట్ చేశారు. డీలక్స్ బస్సు ఛార్జీ రూ.260 ఉంటే నేడు రూ.360 చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: TGPSC Group-1: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే! హన్మకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ ప్రభుత్వం పెంచిన చార్జీ రూ.420.డీలక్స్ బస్సు 260 ఉంటే నేడు 360 రూ..దసరా, బతుకమ్మ పండుగ పేరుతో ప్రజలను దోచుకుంటున్న ఆర్టీసీ..ఒక పక్క బస్సులు కరువు..మరోపక్క భారీగా పెంచిన టికెట్… pic.twitter.com/tM1qe3y7Ue — Devika Journalist (@DevikaRani81) October 14, 2024 దసరా నవరాత్రులు సందర్భంగా ఆర్టీసీ ప్రయాణాలు భారంగా మారాయి. 40% పెరిగిన ఆర్టీసీ ప్రయాణాలు ప్రజల జేబులపై భారం మోపాయి. పెరిగిన ఆర్టీసీ ప్రయాణాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.#tgsrtc @tgsrtcmdoffice @Ponnam_INC @TelanganaCMO @KTRBRS @BRSHarish @TV9Telugu pic.twitter.com/QNkRWyYuWx — Sai krishna.N (@sai_cs56) October 14, 2024 తిరుగు ప్రయాణంలో పెంచారని మరొకరు.. టికెట్ ధర రూ.140తో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో రూ.200 చెల్లించాల్సిన పరిస్థితి అంటూ మరొకరు పోస్ట్ చేశారు. మరో వైపు రద్దీకి తగినట్లుగా బస్సులను ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైందన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తప్పనిపరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వచ్చిందంటూ పలువురు ప్రయాణికులు పోస్టులు పెడుతున్నారు. ఇది కూడా చదవండి: Telangana: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే? బస్సుల్లేక అగచాట్లు #Hyderabad వచ్చేందుకు పాట్లుప్రైవేటు వాహనాలు ఆశ్రయించిన ప్రజలుఫ్రీ బస్సు లేకుంటే పాయే అంటూ ప్రైవేటు వాహనాలు ఎక్కిన మహిళలు📍 మక్తల్, 🕟 తెల్లవారుజామున 5 గంటలకు#Makthal #MahabubNagar #TSRTC #TGSRTC #Palamuru @TGSRTCHQ #SRK pic.twitter.com/XS79KdlQ0E — SARAKU (Sateesh Ravi kumar) (@sargam_ravi) October 14, 2024 హరీశ్ రావు ఆగ్రహం.. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సైతం స్పందించారు. బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజా పాలనా? అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి.… pic.twitter.com/C8NX3EvWXV — Harish Rao Thanneeru (@BRSHarish) October 14, 2024 #telangana-news #tgsrtc #bus-tickets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి