TGPSC Group-1: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే! ఈ నెల ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 14 Oct 2024 in తెలంగాణ జాబ్స్ New Update షేర్ చేయండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. ఇది కూడా చదవండి: TS: తెలంగాణ ఆరోగ్యశాఖలో జాబ్స్...371 నర్సింగ్ పోస్టులు వీరందిరికీ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్తు భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల! రేపు కోర్టు కీలక తీర్పు.. మరో వైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రశ్నాపత్రాల్లో తప్పులు ఉన్నాయని వారు వారు పేర్కొన్నారు. కొందరైతే పాత నోటిఫికేషన్ రద్దు చెల్లదని కూడా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. వాస్తవానికి ఈ రోజు తీర్పు వెల్లడించాల్సి ఉన్నా.. రేపటికి వాయిదా వేసింది. మరికొన్ని రోజుల్లోనే మెయిన్స్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది కూడా చదవండి: 41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ వెల్లడి ఇప్పటికే రెండు సార్లు రద్దు.. గతంలో పేపర్ లీక్ కారణంగా ఒకసారి.. పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించని కారణంగా మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఏకంగా పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి.. అదనంగా మరో 60 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇది కూడా చదవండి: కోచింగ్ సెంటర్లపై ఫిర్యాదు చేయాలంటే.. డయల్ చేయాల్సిన నంబర్ ఇదే! #tgpsc #tgpsc-group-1 #telangana-government-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి