/rtv/media/media_files/2024/10/21/n8RkOMuQ6VDFNWF4qlI8.jpg)
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ ఎగ్జామ్ 5 గంటల వరకు కొనసాగనుంది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదన్న నిబంధనను టీజీపీఎస్సీ తీసుకువచ్చింది.
ఇది కూడా చదవండి: గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా!
గ్రూప్-1 పరీక్షాకేంద్రంలో బస్సు బీభత్సం..
— RTV (@RTVnewsnetwork) October 21, 2024
నాంపల్లిలో ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాల వద్ద బయో టాయిలెట్ బస్సు బీభత్సం.. గ్రూప్-1మెయిన్స్ పరీక్షా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ బస్సు.. వేగంగా వెళ్లి కాలేజీ గోడ, గేటును ధ్వంసం చేసిన బస్సు.. డ్రైవర్ అజాగ్రత్తతో… pic.twitter.com/BOU5J1TLIA
ఈ నిబంధనతో పలు సెంటర్ల వద్ద ఆలస్యగా వచ్చిన వారిని అధికారులు వెనక్కి పంపించారు. బేగంపేట ఉమెన్స్ కాలేజీ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలస్యంగా రావడంతో అభ్యర్థులను పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో లోపలికి అనుమతించాలంటూ వేడుకుంటూ ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. పడిపోయిన తల్లిని చూసి కుమారుడు కన్నీరు పెట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి: Group-1:పరీక్ష జరిగినా రద్దు కావడం ఖాయం.. గ్రూప్-1 అభ్యర్థుల వాదన ఇదే!
గేటు పట్టుకొని రోదిస్తు దయచేసి పంపించండి అంటూ వేడుకుంటున్న గ్రూప్ 1 అభ్యర్థి
— Prashanth BRS (@prashanth_BRS) October 21, 2024
కోఠి ఉమేన్స్ కాలేజ్ దగ్గర ఘటన @AspirantsTspsc pic.twitter.com/dtF4N661BC
నాంపల్లి ఎగ్జామ్ సెంటర్ వద్ద బస్సు బీభత్సం..
ఇదిలా ఉంటే.. నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాల వద్ద పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థుల కోసం బయో టాయిలెట్ బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు నడపడంతో కాలేజీ గేటు, గోడ ధ్వంసమైంది. అయితే.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : ముదురుతున్న వివాదం.. మరోసారి గ్రూప్-1 వాయిదా!?
గ్రూప్ 1 పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం.. లోపలికి అనుమతించని అధికారులు
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) October 21, 2024
దయచేసి లోపలికి అనుమతించండి అంటూ గేటు వద్ద రోదిస్తున్న గ్రూప్ 1 అభ్యర్థి. 😢😢 pic.twitter.com/hedfaE4y7Y
Also Read : రైల్వేలో 8,113 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. కొద్ది గంటలే సమయం