/rtv/media/media_files/2025/03/04/fZ84wMtrPbwEERfnTMa3.jpg)
Karimnagar MLC Elections Counting Updates
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కట్టలు కట్టడం పూర్తి కావడంతో మొదటి రౌండ్ కౌంటింగ్ ను అధికారులు పూర్తి చేశారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
మొదటి రౌండ్ కౌంటింగ్ వివరాలు..
అంజిరెడ్డి - 6712
నరేందర్ రెడ్డి- 6676
ప్రసన్న హరికృష్ణ - 5867
రవీందర్ సింగ్ - 107
మహమ్మద్ ముస్తాక్ అలీ -156
యాదగిరి శేఖర్ రావు - 500
అంజిరెడ్డికి 6712 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6676 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ కూడా మంచి పోటీ ఇస్తున్నారు. తొలి రౌండ్ లో ఆయనకు 5867 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రౌండ్ కు 21 వేల ఓట్లను లెక్కించనుండగా.. ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ ను ప్రారంభించారు.