DSC: డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రావు

డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
DSC

డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. ఇటీవల డీఎస్సీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే వందల మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు కూడా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. వాళ్లు ఏదైనా ఒకదాంట్లో చేరితే మళ్లీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండిపోతాయి. అందుకే ముందుగా ఎస్‌ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో లిస్టును విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారిది ఇస్తామన్నారు. మొదటి లిస్టులో ఉన్నవారు  రెండో లిస్టులో కూడా ఉన్నట్లైతే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్‌లో ఉన్నవారిని చేరుస్తామని తెలిపారు. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. 

Also Read: మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలో 43 మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యే లిస్టులో ఉన్నారు. అప్పుడు వాళ్లకి డీఈవో ఆఫీస్ సిబ్బంది ముందుగానే ఫోన్ చేస్తారు. ఏ పోస్టు కావాలో డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మొత్తంగా 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు సాగింది. మరోవైపు ఖాళీ పోస్టులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని సీఎం రేవంత్‌ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. అలాగే తక్కువ సమయంలోనే డీఎస్సీకి ఎంపికైనవారికి నియామక పత్రాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists In Karre Gutta : కర్రెగుట్టల్లో కాల్పుల మోత..సరిహద్దులన్నీ మూసేసి..బాంబుల వర్షం

గత మూడు రోజులుగా సంచలనం రేపుతున్న ఆపరేషన్‌ కర్రెగుట్టలు మొదలైంది. ఈ ఉదయం నుంచి గుట్టల్లో బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి.

New Update
Operation Karre Gutta

Operation Karre Gutta

Maoists In Karre Gutta :  గత మూడు రోజులుగా సంచలనం రేపుతున్న ఆపరేషన్‌ కర్రెగుట్టలు మొదలైంది. ఈ ఉదయం నుంచి గుట్టల్లో బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతున్నది. హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

అడుగడుగునా పోలీసుల దిగ్బంధం, రహదారుల మూసివేత కారణంగా సామన్యులెవరూ కర్రెగుట్టల వైపు వెళ్లడానికి సాహసించడం లేదు.  గుట్టలు. బాంబుల మోతతో దద్దరిల్లుతుండడాన్ని స్థానికులు నిర్దారించారు. అయితే.. భీమారంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు బేస్‌ నుంచి ముందుకు వెళ్లడానికి వీల్లేదని గ్రామస్థులను నిలిపివేశారు. అలాగే చుట్టూ పక్కల ఉన్న ఆదీవాసీలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బలగాలు హెచ్చరించాయి.   మావోయిస్టులు సేఫ్ జోన్‌‌‌‌గా ఏర్పరచుకున్న స్థావరాల వద్దకు పోలీస్ బలగాలు చేరు కున్నట్టు తెలుస్తున్నది. ఈ బలగాలకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సరుకులను హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో సరఫరా చేస్తున్నారు. బుధవారం ఉదయం వెంకటాపురం మండల కేంద్రంలో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యాయి. ఆ హెలికాప్టర్ల నుంచి వాటర్ బాటిల్స్, కొన్ని బాక్సులు గుట్టల వద్దకు తీసుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.  

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

అడవుల్లోకి రావొద్దని ప్రజలకు హెచ్చరిక.. 

అడవుల్లోకి రావొద్దని సమీప గ్రామాల ప్రజలకు రెండ్రోజుల క్రితమే పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. విధుల్లో భాగంగా గుట్టల వద్దకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు తెలిపినట్టు అటవీ శాఖ సిబ్బంది కూడా చెబుతున్నారు. రెండ్రోజులుగా గుట్టల్లో ఎన్‌‌‌‌కౌంటర్ జరుగుతున్నట్టు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. అడవిలో కాల్పులు జరిగినట్టు, భారీగా శబ్దాలు వస్తున్నట్టు సమీప గ్రామాల్లోని ప్రజలు పేర్కొంటున్నారు. అయితే అసలు గుట్టల్లో ఏం జరుగుతున్నది? అనే వివరాలు మాత్రం పోలీసులు చెప్పడం లేదు. పోలీస్ ఉన్నతాధికారులు వెంకటాపురం వస్తున్నట్టు బుధవారం ప్రచారం జరిగింది. దీంతో మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా దళం గురించి ఏవైనా వివరాలు వెల్లడిస్తారని భావించినా, ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. కాగా, కర్రె గుటల్లో కూంబింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చెప్పారు. చత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ బలగాలు అందులో పాల్గొంటున్నాయని బుధవారం తెలిపారు. అయితే ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ఎందరు చనిపోయారు? అనే విషయం తమకు తెలియదని చెప్పారు.  

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే

 మందుపాతరల నిర్వీర్యం

కాగా గత కొంతకాలం క్రితమే కర్రెగుట్టల చుట్టూ మందుపాతరలు అమర్చామని సామాన్యులు అటువైపు వచ్చి ప్రాణాలు కోల్పొవద్దని మావోయిస్టులు హెచ్చరించారు. తాజాగా పోలీసు బలగాలు గుట్టను చుట్టుముట్టడంతో పాటు గుట్టల చుట్టూ జల్లడపడుతున్నాయి. సుమారు 4 వేల మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా, డీఆర్‌జీ, బస్తర్‌ఫైటర్స్‌ బలగాలతోపాటు.. తెలంగాణ పోలీసులు కూడా కర్రెగుట్టలను చుట్టుముట్టిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు కూంబింగ్‌ కొనసాగిస్తూనే.. బాంబ్‌ డిస్పోజబుల్‌, డాగ్‌ స్క్వాడ్‌లు గుట్టల చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించి, నిర్వీర్యం చేస్తున్నాయి. తెలంగాణ వైపు.. వెంకటాపురం మండలంలోని రాచపల్లి కలిపాక, మోట్లగూడెం ప్రాంతాల వరకు కూడా బాంబు పేలుడు శబ్దం వినిపిస్తోందని స్థానికులు తెలిపారు. ఈ పేలుళ్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను బలగాలు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో సంభవిస్తున్నట్లు సమాచారం.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!


కాల్పులు విరమణ పాటించండి : పీస్‌ డైలాగ్‌ కమిటీ


కాగా కర్రెగుట్టలను భద్రత బలగాలు ముట్టడించిన నేపథ్యంలో  పీస్‌ డైలాగ్‌ కమిటీ స్పందించింది. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీడీసీ చైర్మన్‌ జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు  బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీసీ వైస్‌ చైర్మన్లు జంపన్న, బాలకృష్ణారావు, కందిమల్ల ప్రతాప్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి, ఎస్‌.జీవన్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. హింస వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. మావోయిస్టులు ఇప్పటికే మూడు సార్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినందున కాల్పులు విరమించాలని కోరారు. కర్రెగుట్టల చుట్టూ 10 వేల మంది పోలీసులను మోహరించి, కూంబింగ్‌ చేస్తున్నారు. మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను కాల్చిచంపుతున్నారని వారు ఆరోపించారు. కర్రెగుట్ట నుంచి పోలీసు బలగాలను వెనక్కి రప్పించడానికి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి అని వారు డిమాండ్‌ చేశారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

 

Advertisment
Advertisment
Advertisment