తెలంగాణలో సెమిస్టర్ విధానంలో టెన్త్ క్లాస్ పరీక్షలు..!

పదో తరగతి పరీక్షలు సెమిస్టర్ విధానంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి ఏడాదికి రెండు సార్లు ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నారు.

New Update
10th

తెలంగాణ సర్కార్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కీలక మార్పులు చేయాలని యోచిస్తోంది. పదో తరగతి పరీక్షలు సెమిస్టర్ విధానంలో నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. అకాడమిక్ ఈయర్ మొత్తం చదివి ఒకేసారి పరీక్షలు రాయాలంటే విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, పిల్లలపై ఒత్తిడి తగ్గించడానికి అకాడిక్ ఈయర్ లో రెండు సార్లు సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ఇది కూడా చదవండి : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు

ఇది కూడా చదవండి : ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

సెమిస్టర్ సిస్టమ్ విధానం అమలుపై ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం సేకరించనుంది. డిసెంబర్ 2న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఖమ్మం జిల్లా కుసుమంచి, జీళ్ల చెరువు హైస్కూల్స్ సందర్శించినప్పుడు ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సీబీఎస్ విధానంలో కూడా ఈయర్లీ రెండు సెమిస్టర్ రూపంలో    నిర్వహించాలని ప్లాన్ చేస్తు్న్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్‌ విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నది.

ఇది కూడా చదవండి : Breaking: హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఒకరికి గాయాలు

దీనిపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఇంటర్, టెన్త్ మినహా తెలంగాణలో డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ సెమిస్టర్ విధానంలోనే కండక్ట్ చేస్తున్నారు. ఇక ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టకల్ మార్కులు పెంచాలని వాదన కూడా నడుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment