/rtv/media/media_files/2025/02/12/lILkTTa8aWl1hO0573Wp.jpg)
Revanth Reddy house
Breaking News : ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మున్నురుకాపు సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో ముఖ్యమంత్రి ఇంటివద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలా సమయం శ్రమించాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇపుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికి వదిలేశారని మున్నురు కాపు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ, ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించారు.
ఇది కూడా చదవండి: Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..!
ధర్మసేన సంస్థ రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో పలువురు మున్నురుకాపు నాయకులు జూబ్లీహిల్స్ రోడ్ నెం 36 నుంచి సీఎం నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళన కారుల విషయం ముందుగానే పసిగట్టిన పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లేందుకు యత్నిస్తున్న సంస్థ కన్వీనర్ శ్రీనివాస్ పటేల్‌తో సహా పదిమందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
ఈ సందర్భంగా శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న బీసీ కులగణనలో మున్నూరు కాపుల జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. రాజకీయంగా మున్నూరు కాపులు ఎదుగుతారనే దురాలోచనతోనే పలు జిల్లాల్లో ఉన్న మున్నూరు కాపులను ఓసీ జాబితాలోకి చేర్చారన్నారు. గత ప్రభుత్వం హయాంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం తాము ఆందోళన చేస్తున్నప్పుడు మద్దతు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాత్రం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ పరిధిలో నుంచి తొలగించాలని, మున్నూరు కాపుల పేరు చివరన అందరికీ పటేల్ అని చేర్చేలా గెజిట్ విడుదల చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే