/rtv/media/media_files/2025/02/17/8Ez8gVHvtp8FWv7OoIdR.webp)
10 BRS defectors
BRS MLAs : రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పార్టీకి చెందిన నాయకులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే అనర్హులుగా ప్రకటించే హక్కు స్పీకర్ కు మాత్రమే ఉందని హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేసింది. అయితే స్పీకర్ ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్
కాగా ఈ విచారణ చాలా కాలంగా సాగుతూ వస్తున్నది. గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వార్నింగ్ సైతం ఇచ్చింది. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. అయితే సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే వరకా అంటూ అని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. కేసును రేపటికి వాయిదా వేసింది.
Also Read: ఓర్నీ ఎవర్రా మీరంతా.. ఒక ఆటోలో ఇంతమంది ఎలా పట్టార్రా బాబు!
అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అందజేశారు. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో వారున్నారు. అదే క్రమంలో వారి సభ్యత్వాలు రద్దవుతాయని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ నమ్మకంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపటి విచారణ కీలకంగా మారగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం రేపటి తీర్పుతో తేలుతుందా లేక కేసు మరోసారి వాయిదా పడుతుందా? చూడాలి.
Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?