/rtv/media/media_files/2025/03/17/r5Gi3R65vioGgs7pcSXG.jpg)
BRS Activists:
BRS Activists: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్వీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్వీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్వీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేందుకు నేతలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అయితే, ముందుగా అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని బీఆర్‌ఎస్వీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోరాటాలకు ఊపిరిలూదిన విద్యార్థిలోకంపై కక్షగట్టింది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో ఆందోళనలపై నిషేధం విధించిన నేపథ్యంలో బీఆర్ఎస్వీ శ్రేణులు అసెంబ్లీని ముట్టడించారు.
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయా పోలీసు స్టేషన్లకు బీఆర్ఎస్వీ శ్రేణులను తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఓయూ వీసీ ఇచ్చిన సర్క్యూలర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయం. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డి దారిన రావచ్చు.. కానీ ఓయూ విద్యార్థులు విద్య, నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్పా? అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్వీ శ్రేణులు నినాదాలు చేశారు.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!