/rtv/media/media_files/2025/02/17/8Ez8gVHvtp8FWv7OoIdR.webp)
10 BRS defectors
10 BRS defectors : తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన పలు పిటిషన్లు ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టు విచారణ జాబితాలో రిజిస్టార్ మెన్షన్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టీ. ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఎమ్మెల్యే లు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం
అయితే ఈ పిటిషన్లు గత వారం విచారణ జాబితాలో మెన్షన్ అయినప్పటికీ... పలు కారణాల వల్ల ఆ రోజు విచారణ జరగలేదు. దీంతో శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి బెంచ్ ఎదుట పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత వారం కూడా అనివార్య కారణాలతో లిస్ట్ అయినా విచారణకు రాలేదని గుర్తు చేశారు. ఈ విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకొన్న బెంచ్.. ఈ నెల 25న వాదనలు వింటామని పేర్కొంది.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
దీంతో ఏ క్షణమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఈనెల25న పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణకు రానుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనర్హత వేటుపై స్పష్టమైన సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ ను కోరింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని పది మంది ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.
Also Read : కేసీఆర్‌కు BC సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ లేఖ
కాగాపార్టీ ఫిరాయింపులు కేసులో ..తెలంగాణ స్పీకర్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి…మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ? అంటూ తెలంగాణ స్పీకర్ ను నిలదీసింది. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా ? అంటూ తెలంగాణ స్పీకర్ ను అడిగింది సుప్రీం కోర్టు. దీంతో తెలంగాణ స్పీకర్ ను అడిగి నిర్ణయం చెపుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్న స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని అటు బీఆర్ఎస్ తరపున లాయర్ వాదనలు వినిపించారు.
Also Read : ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్!