Telangana: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే?

దసరా పండున నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి 11వ తేదీ వరకు తెలంగాణలో రూ.1057 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే 25 శాతం వరకూ అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది.

New Update
wine shops

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలను జరుపుకున్నారు. తెలంగాణలో ముక్క, చుక్క లేనిదే పండుగ ఉండదు. పండుగకి కొత్త బట్టలు ఎంత ముఖ్యమో.. ఇక్కడ మందు కూడా అంతే ముఖ్యం. దసరా పండుగ ప్రారంభం అవుతుందంటే వారం రోజుల నుంచే మందు బాబులకు అసలైన పండుగ మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరా పండుగకు 15 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి.

ఇది కూడా చూడండి: అమ్మవారి విగ్రహం ధ్వంసం.. ఆలయం వద్ద పెరిగిన ఉద్రిక్తత

దసరాకు ముందుగానే..

దసరా పండగకు మద్యం ఎక్కువగా అమ్ముడవుతుందని ఊహించిన వ్యాపారులు ముందుగానే స్టాక్ పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే స్టాక్ అంతా సేల్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యి కంటే ఎక్కువగా బార్లు, క్లబ్‌లు, పబ్‌లు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: యాంకర్‌ కావ్యశ్రీపై దాడి.. ఆ పార్టీ మాజీ ఎంపీ అనుచరుడే

వీటిన్నింటికి దసరా ముందు రోజ అనగా శుక్రవారం దాదాపుగా రూ.205 కోట్ల స్టాక్‌ ఎక్సైజ్‌ డిపోల నుంచి చేరిందని గణాంకాలు తెలుపుతున్నాయి. మిగతా రోజులతో పోలిస్తే దసరా పండుగ రోజుల్లో మద్యం అమ్మకాలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. అక్టోబర్ 10వ తేదీన అయితే రూ.139 కోట్ల మద్యం వైన్‌ షాపులకు చేరింది.

ఇది కూడా చూడండి: తాకితే నరికేయండి.. అమ్మాయిలకు కత్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇదిలా ఉండగా అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు రూ.1,057.42 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని గణాంకాలను అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో 10.44 లక్షల కేసుల లిక్కర్‌, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఈ నెల 10వ తేదీ వరకు రూ.852.4 కోట్ల విలువైన 8.36 లక్షల కేసుల లిక్కర్‌, 14.53 లక్షల కేసుల బీరు సేల్ అయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..

Advertisment
Advertisment
తాజా కథనాలు