weather Report: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు చలిగాలులు..

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. అయితే మరో రెండ్రోజులు పాటు చలి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది.

New Update
Cold

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. సాయంత్రం 6 దాటగానే బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. అయితే మరో రెండ్రోజులు పాటు చలి గాలులు వీచే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. 

Also read: మహిళలకు గుడ్‌న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?

ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంతి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. అల్పపీడన ప్రభావం నైరుతి బంగాళఖాతంలో కేంద్రీకృతమే ఉందని పేర్కొంది. 

Also read: 22 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లో చిక్కుకున్న మహిళ.. ఎట్టకేలకు భారత్‌లోకి

సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. అలాగే ఈ అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని.. పశ్చిమ, వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు చలికి తట్టుకోలేకపోతున్నామంటూ పలువురు సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. అయితే వృద్ధులు, చిన్న పిల్లలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Also Read: నాకు మంత్రి పదవి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Also Read: పబ్జీలో పరిచయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.

New Update

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.

తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.

అయితే... విజయశాంతి ట్వీట్‌ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్‌ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ కూడా HCU భూములపై రియాక్ట్‌ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్‌ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్‌ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్‌ అయిపోయిందని విమర్శిస్తున్నారు. 

(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )

Advertisment
Advertisment
Advertisment