/rtv/media/media_files/2025/02/25/Yi3xCMEtpaf6EVkYE8hp.jpg)
telangana TS LAWCET, PGLCET 2025 schedule released
తెలంగాణ లా సెట్, PGL సెట్ 2025 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-26 విద్యాసంవత్సరానికి లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీ.. ఎంట్రెన్స్ ఎగ్జామ్ బాధ్యతలను చూడనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ లా సెట్ 2025 షెడ్యూల్ ప్రకారం..
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
పూర్తి వివరాలివే
ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభ ప్రక్రియ మార్చి 1, 2025వ తేదీన ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆలస్య రుసుంతో చూస్తే.. చివరితేదీ దాటిన నుంచి ఏప్రిల్ 25 వరకు రూ.500 జరిమానా చెల్లించి అప్లై చేసుకోవచ్చు.
మే 5 వరకు రూ.1,000 ఆలస్యం రుసుం చెల్లించాలి.
మే 15 వరకు రూ.2,000 ఆలస్యం రుసుం చెల్లించాలి.
మే 25 వరకు రూ.4,000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 20 నుంచి అవకాశం కల్పించారు.
మే 25వ తేదీతో సవరణ గడువు పూర్తి అవుతుంది.
హాల్ టికెట్లు మే 30న రిలీజ్ అవుతాయి.
జూన్ 6వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.
ఉదయం పూట మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష ఉంటుంది.
మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష ఉండనుంది.
లాసెట్ ప్రిలిమినరీ కీ జూన్ 10, 2025న రిలీజ్ అవుతుంది.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
జూన్ 14 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
జూన్ 25వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు.
3ఏళ్ల LLB కోర్సుల్లో ప్రవేశాలకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
5ఏళ్ల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసిన వారు అర్హులు.
LLM ప్రవేశాలకు డిగ్రీతోపాటు LLB డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
/rtv/media/media_files/2025/02/25/VuLQQjyP47Lvt7v5aaWh.jpeg)