/rtv/media/media_files/2025/03/13/VGcu55f9k6P5R8b824NY.jpg)
Nagam Janardhan Reddy
తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. చాలా రోజుల తర్వాత కలిసిన నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీతోనే రాజకీయ రంగప్రవేశం చేసిన నాగం జనార్దన్ రెడ్డి.. ఆ పార్టీలో అత్యంత కీలకంగా మారారు. ముఖ్యంగా దేవేందర్ గౌడ్ పార్టీని వీడిన తర్వాత దాదాపు నంబర్.2 స్థాయికి చేరుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి తెలంగాణ నగారా సమితిని స్థాపించారు నాగం. అనంతరం బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: CM Revanth: ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
సీఎం చంద్రబాబుని కలిసిన తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి జనార్థన్ రెడ్డి. @ncbn @JaiTDP #AndhraPradesh #chandrababu #janardhanreddy #RTV pic.twitter.com/jviRQBU3qe
— RTV (@RTVnewsnetwork) March 13, 2025
వైఎస్ సర్కార్ పై పోరాటం..
ఇదిలా ఉంటే.. 2004-2009 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాగం జనార్దన్ రెడ్డి వైఎస్ సర్కార్ పై తీవ్రంగా పోరాటం చేశారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతూ ఇరుకున పెట్టేవారు. ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ పై తీవ్రంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో నాగం జనార్దన్ తో పాటు ఆ సమయంలో టీడీపీలో ఉన్న అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా అవరావతిలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇది కూడా చదవండి: పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు.. కౌశిక్ రెడ్డి సంచలనం!
అయితే.. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నాగం మళ్లీ సొంత గూటికి చేరుతారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. కానీ.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది.