అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపీసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్ కోసం సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ మరింత హైడ్రామా నడిచింది. అఘోరీ జండర్ తెలీకుండా జైల్లో ఉంచుకోమంటూ జైలు అధికారులు చెప్పడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల అనంతరం అఘోరీ ట్రాన్స్‌జెండర్‌గా నిర్దారించి జైల్లో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
పూర్తిగా జైల్లోకి వెళ్తేనే
ఈ నేపథ్యంలో అఘోరీ సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొదటి మోసపోయింది మాత్రం నేనే అంటూ అఘోరీ ఫస్ట్ వైఫ్ రాధిక మీడియా ముందుకు వచ్చారు. తాజాగా రాధిక మరోసారి RTVతో మాట్లాడింది. ఇందులో భాగంగా అఘోరీకి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకుంది. అఘోరీ అరెస్ట్ అవడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది. కానీ ఇది కేవలం సగం మాత్రమేనని.. పూర్తిగా జైల్లోకి వెళ్లిన తర్వాతే తాను ఫుల్ హ్యాపీగా ఉంటానని తెలిపింది.
Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
పురుష బాధితులు
అఘోరీ దైవం అనే ముసుగులో వచ్చినపుడు దైవభక్తితోనే ఉండాలే తప్ప.. కూతురు, శిష్యురాలు అని చెప్పి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని తెలిపింది. అఘోరీ బాధితులు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. ఆ లిస్టులో ఆడవారే కాకుండా మగవారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అఘోరీ ఒక ట్రాన్సజెండర్.. అతడు తన మాటలతో ఎవరినైనా మాయ చేసేస్తాడు. ఎలాంటి వారినైనా లొంగదీసుకుంటాడు. అఘోరీ మాయలో పడిన వారు బయటకు రావడం చాలా కష్టం అని ఆమె తెలిపారు.
ఉరిశిక్ష పడాల్సిందే
ఆయన మాటలకు ఎవరైనా పడిపోవలసిందే అని చెప్పుకొచ్చింది. ఇక అఘోరీకి కఠిన శిక్ష పడాలని.. అది కూడా ఉరిశిక్ష వేయాలని తెలిపింది. అదే అసలైన న్యాయం అని పేర్కొంది. అఘోరీకి వశీకరణ శక్తులు ఉండొచ్చని.. తాను కూడా అఘోరీ ఉన్నంత సేపు ఏం చెప్తే అదే వినేదాన్ని అని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
aghori Arrest | lady aghori arrest | lady aghori arrest news | lady aghori arrest updates | Radha Reaction On Aghori Arrest | latest-telugu-news | telugu-news | Aghori First Wife