BIG BREAKING: కోర్టులోనే కన్నుమూసిన మరో న్యాయవాది!

సికింద్రాబాద్ కోర్టులో విషాదం చోటు చేసుకుంది. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే గుండెపోటుకు గురై కుప్ప కూలారు. ఆస్పత్రికి చేరే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిన్న హైకోర్టులో వేణుగోపాల్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే.

New Update
Lawyer Died in Court Secunderabad

Lawyer Died in Court Secunderabad

నిన్న తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది కన్నుమూశారు. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే కన్నుమూశారు. తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment