/rtv/media/media_files/2025/03/07/aSuzXaK0lQfwwuwtwSrX.jpg)
Deputy CM Bhatti Vikramarka
తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఊహించని పరిణామం ఎదురైంది. బిల్లులు క్లియర్ చేయాలని ఆయన ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. భట్టీ విక్రమార్కతో భేటీ అయ్యేందుకు వివిధ జిల్లాల దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు.
20% పాలన
— Sarita Avula (@SaritaAvula) March 7, 2025
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది కాంట్రాక్టర్లు.
భట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు
ఎస్పీఎఫ్ ఆపడంతో ఆందోళన దిగిన కాంట్రాక్టర్లు.
మూడేళ్ళుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన.… pic.twitter.com/svocesnBcj
అయితే.. వారిని ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ల ఆందోళనతో సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోయిన భట్టి విక్రమార్క వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు బిల్లులు క్లియర్ కావాలంటే 20 శాతం కమిషన్ అడుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. కాంట్రాక్టర్ల ఆందోళనపై ప్రభుత్వ వర్గాలు ఇంతవరకు స్పందించలేదు. ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం 20 శాతం కమిషన్లు డిమాండ్ చేయడమే ఈ పరిస్థితికి కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు