/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-2026-05-13-18-01-35.jpg)
Bandi Bhagirath
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం తెలంగాణ పోలీసులు వెతుకులాటను తీవ్రం చేశారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో విస్తృతంగా గాలిస్తున్నాయి.
బండి సంజయ్ నివాసంలో సోదాలు
గాలింపులో భాగంగా కరీంనగర్‌లోని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ నివాసంతో పాటు, భగీరథ్ మేనమామ వంశీకృష్ణ ఇల్లు, ఇతర బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మరోవైపు, భగీరథ్ ఢిల్లీలో కొందరు బీజేపీ నేతల రక్షణలో ఉన్నారనే సమాచారంతో పోలీసుల బృందం అక్కడికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ కేసు నమోదైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. భగీరథ్ ఇప్పటికే పోలీసుల అదుపులోనే ఉన్నారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. ఈరోజు సాయంత్రం లోపే అతడిని మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని సమాచారం...ఒకవైపు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, మరోవైపు భగీరథ్ స్వయంగా లొంగిపోతారనే వార్తలు రావడం.. వీటన్నిటి మధ్య అతను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం సాగుతుండటంతో ఈ వ్యవహారంలో కొంత ఉత్కంఠ, అయోమయం నెలకొంది.
కాగా 17 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబ సభ్యులు మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మొదట జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత తీవ్రమైన, నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద పోక్సో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ గత కొన్ని రోజులుగా స్విచ్ఛాఫ్ వస్తోంది.
Follow Us