సంక్రాంతికి ఇంటికి తాళం వేసి ఊళ్ళో చిల్ అవుతున్నారా? మీ ఇల్లు గుల్లే !

క్రిస్మస్, సంక్రాంతి పండగల సీజన్ వేళ తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇంటి తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లేవారి ఇళ్ళు దొంగల పాలవకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరి మీఇళ్ళు గుళ్ళ కాకూడదంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

New Update
Theft in home

Theft in home

Telangana:  పండగ సీజన్ వచ్చేసింది.. క్రిస్మస్, సంక్రాంతి రెండు పండగలు వెనువెంటనే వస్తున్నాయి. ఇక ఈ సమయంలో  పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీసులకు, స్కూల్ లకు సెలవులు పెట్టేసి.. పిల్లలతో కలిసి సొంతూళ్ల  బాట పడతారు. వారం రోజుల పాటు ఇళ్లకు తాళాలు వేసి సంతోషంగా.. సొంతూరులో అమ్మ చేసిన గారెలు, పిండి వంటలు తింటూ చిల్ అవుతారు. మీరు బాగానే ఎంజాయ్ చేస్తారు సరే.. మరి ఇక్కడ తాళం వేసిన మీ ఇంటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? తాళం వేసిన ఇంటికి ఏమవుతుంది..! అని లైట్ తీసుకోవద్దు. అదే మీ కొంప ముంచుతుంది. ఈ మధ్య తాళం వేసిన ఇళ్ళే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు దొంగలు. దొరికిందే సందని ఇంటిని గుల్ల చేస్తున్నారు. పక్కాగా రెక్కీ చేసి.. రాత్రికి రాత్రి ఇంటిని దోచేస్తున్నారు. తీరిగ్గా ఇంటికి వచ్చాక కానీ తెలియదు మీ ఇళ్ళు మొత్తం దోచేశారని. 

అయితే పండగ సమయాల్లో ఇలాంటి గజ దొంగలు నుంచి తాళం వేసిన మీ ఇంటి కాపాడుకోవడానికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఊరు వెళ్లేముందు.. ఈ 7 జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

పోలీసుల 7 జాగ్రత్తలు..  

  • ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు కనపడే విధంగా గేటుకు, మెయిన్ డోర్ కి తాళం వేయకూడదు. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. దీని వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారని అనుకుంటారు. 
  • ఇంటికి, ఇంటి గేటుకు తాళం వేసి ఎప్పుడూ  కూడా దూర ప్రాంతాలకు వెళ్ళవద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. మీ ఇంటి దగ్గర తెలిసిన బంధువులు, స్నేహితులు పడుకునేలా ఏర్పాట్లు  చేయండి. 
  • ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో అస్సలు పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. 
  • ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం మంచిది.  పోలీసులకు చెప్పడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై  ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 
  • నైట్ టైం ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. 
  • అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. 
  • మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. 
     ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు