కొత్త టీచర్లకు అలర్ట్.. ఆ శిక్షణ పూర్తి చేస్తేనే పోస్టింగ్! కొత్త టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ పూర్తి చేసినవారికే బోధనకు అర్హత కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నైతిక విలువలు, చట్టాలు, బోధన, టెక్నాలజీపై విద్యావంతులు, మేధావులతో క్లాసులు నిర్వహించనుంది. By srinivas 07 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TG New Teachers: ఈ ఏడాది పాఠశాలల్లోకి రాబోయే కొత్త టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక సిలబస్ రూపొందించనుండగా.. శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (SCERT)కి అప్పగించగా.. ఇందుకు అవసరమైన పాఠ్యాంశాల ప్రణాళిక సిద్ధ చేస్తోంది. కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక రిసోర్స్ పర్సన్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విలువల్లేని టీచర్లు.. ఈ మేరకు ఇటీవలే డీఎస్సీ ఫలితాలను వెల్లడించిన ప్రభుత్వం.. అక్టోబర్ 9న టీచర్ల నియామక ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే విత్రమైన ఉపాధ్యాయ వృత్తి దారితప్పుతోందని, విలువల్లేని టీచర్లు ఉన్నారంటూ తీవ్ర విమర్శలొస్తున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు కీచకులుగా మారి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు సమాజం, నైతిక విలువలకు సంధించి పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలికల, మహిళా చట్టాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా కొత్త చట్టాలను ఇందులో చేర్చనున్నారు. సిలబస్‌లో మార్పులు.. బీఈడీ సిలబస్ మారుతూ వస్తోంది. సైకాలజీ, ఫిలాసఫీ, పాఠశాల నిర్వాహణ, బోధన విధానం, విద్యార్థి మానసిక ధోరణికి సంబంధించి అనేక పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. దీంతో జాతీయ విద్యా సర్వే నివేదికలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సైకాలజీ, టీచర్లకు విద్యార్థికి మధ్య సమన్వయం, సరికొత్త మెళకువలతో బోధన వంటి టెక్నిక్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. టెక్నాలజీపై పట్టు సాధించేలా.. ప్రభుత్వ పాఠశాలల్లో పిలల్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో క్లాసులు చెప్పించాలని భావిస్తున్నారు. అలాగే ఇటీవల పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పిల్లలకు మరింత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా టెక్నాలజీపై పట్టున్న కొత్త టీచర్లను నియమించనున్నారు. బోధనలో త్రీడీ, వర్చువల్ రియాలిటీ, ఆగుమెంటేషన్, ఏఐ టెక్నాల వంటి వంటి మెళకువలను నేర్పించనున్నారు. మొత్తం 11,062 పోస్టులు.. ఈ మెగా డీఎస్సీ 2024లో మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6508, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 182, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్220 పోస్టులున్నాయి. సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 796 పోస్టులు ఉన్నాయి. #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి