/rtv/media/media_files/2025/03/06/XEx7AFWMc4pBAYTAhHXI.jpg)
TG MLC Elections 2024
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీతో బీఆర్ఎస్ మమేకం అయ్యిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలానే వ్యవహరించదని ఆరోపించారు. బీఆర్ఎస్ తరఫున ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టలేదన్నారు. రవీందర్ సింగ్ కు వ్యక్తిగతంగా ఓట్లు వచ్చాయన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు.. సీఎం రేవంత్ కు హైకోర్టు బిగ్ షాక్!
బీఆర్ఎస్, బీజేపీది ఫెవికల్ బంధం
పరోక్షంగా రవీందర్ సింగ్ ను బీఆర్ఎస్ బలపరిస్తే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికల్ బంధమన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ పార్టీని శ్రీధర్ బాబు నిలదీశారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: PM Modi : MLC ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే?
కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ సైతం ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ను బీజేపీ ఎలా లొంగదీసుకుందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టం అయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు. ఆ రెండు పార్టీలను వేరువేరుగా చూడడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బీజేపీ ఓట్ల కోసం.. ఎన్నికల కోసం పోరాడుతోందన్నారు. ఆ పార్టీ ప్రజల కోసం ఎప్పుడూ పోరాటం చేయదన్నారు. ఉప ఎన్నికలు వస్తే సత్తా చటుతాం అనే బీఆర్ఎస్.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై పోరాటం చేసి.. బీజేపీకి ఓట్లు వేయించిందన్నారు.
బీజేపీ ప్రజల కోసం కాదు, ఓట్ల కోసం పోరాడుతుంది - అద్దంకి దయాకర్
— Telugu Galaxy (@Telugu_Galaxy) March 6, 2025
ఐడియాలాజికల్ వార్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో భూస్థాపితం చేయడం ఖాయం
బీజేపీ ఓట్ల కోసం పోరాడుతుంది. ప్రజల కోసం కాదు. కొన్ని పార్టీలను పక్కనపెట్టుకొని పోరాడుతుంది.
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,… pic.twitter.com/1CG2Qk070n
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో తమకు తిరుగు లేదని బీజేపీ నేతలు చెబుతుండగా.. బీఆర్ఎస్ సపోర్ట్ తోనే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినా ఓటర్ల మద్దతు లభించలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.