Ponguleti: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగా నిన్న పొలిటికల్ బాంబ్ పేలుతుందని అంతా భావించారు. కానీ నిన్న అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. దీంతో మంత్రి పొలిటికల్ బాంబ్ ఏమైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. By Nikhil 27 Oct 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి సియోల్ నుంచి మనం పోయిన తర్వాతనో.. లేదా ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఒకటో, రెండో పొలిటికల్ బాంబులు పేలుతాయి.. ఇటీవల దక్షిణ కొరియా టూర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పిన మాటలివి. ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారాయి. నిన్న మంత్రి వర్గ సమావేశం నేపథ్యంలో ఈ కామెంట్స్ పై జోరుగా చర్చ సాగింది. మంత్రి వర్గ సమావేశం తర్వాత నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో మంత్రి చెప్పిన పొలిటికల్ బాంబులు పేలలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లు తదితర అంశాలపై ప్రస్తుత రేవంత్ సర్కార్ విచారణ చేస్తోంది. ఇది కూడా చదవండి: 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ? కాళేశ్వరంపై చర్యలు ఉంటాయని ప్రచారం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నాటి నుంచి వారు ఈ ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరైన అధికారులు సైతం తాము కేసీఆర్ చెప్పినట్లే చేశామని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ పై చర్యలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు? ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుందని.. ఈ విషయంలోనూ చర్యలు ఉంటాయన్న ప్రచారం సాగింది. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకే వారి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేశారని కాంగ్రెస్ నేతలు అనేక సార్లు ఆరోపించారు. దీంతో వారిపై చర్యలు ఉంటాయని అంతా భావించారు. మరో వైపు ధరణికి సంబంధించి సైతం గత బీఆర్ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ అనేక సార్లు ఆరోపణలు చేసింది. ఈ విషయమై కూడా ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటన రాలేదు. Also Read : వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే? మంత్రి బాంబులు ఎందుకు పేలలేదు? అయితే.. మంత్రి చెప్పినట్లుగా పొంగులేటి బాంబులు ఎందుకు పేలలేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్లాలని భావిస్తోందన్న చర్చ నడుస్తోంది. అన్ని ఆధారాలతోనే చర్యలు ఉంటాయని.. తొందరపడి ముందుకు వెళ్లొద్దన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి ప్రకటన లేదన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. నిన్న ప్రెస్ మీట్ సమయంలో మంత్రి పొంగులేటి ఈ విషయంపై ప్రస్తావించారు. దీపావళి పటాసుల కన్నా ముందే రాజకీయ బాంబు పేలుతుందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి చెప్పినట్లుగా దీపావళిలోగా అయినా బాంబులు పేలుతాయా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. Also Read : ఆ విషయంలో కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య షాకింగ్ కామెంట్స్ #telangana-politics #south-korea #minister-ponguleti-srinivas-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి