/rtv/media/media_files/2026/04/11/inter-2026-04-11-19-22-47.jpg)
Telangana Inter results tomorrow at 11 am
Inter Results 2026: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ ఫలితాలు రేపు ఉదయమే విడుదల కానున్నాయి. మొదటి, రెండవ సంవత్సరాల ఫలితాలను ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఆదివారం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫలితాలు చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ రోజును ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఈ ఫలితాలను రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో కలిసి ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కాగా విద్యార్థులు tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లలో హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్‌సైట్‌లలో విద్యార్థులు తమ రోల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తోనే రిజల్ట్స్‌ని పొందవచ్చు.
ఇదే కాక ఇంటర్ విద్యార్థులు తమ రిజల్ట్స్‌ని నేరుగా తమ వాట్సప్ ద్వారా కూడా పొందవచ్చు. (tg inter results in whatsapp) నేరుగా డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ ఫలితాల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. వాట్సప్‌లోనే ఫలితాలు పొందాలంటే స్మార్ట్ ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకొని ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Follow Us