UNESCO: తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కో జాబితాలో ముడమాల్‌ నిలువురాళ్లు

తెలంగాణకు మరో గుర్తింపు లభించింది. నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలో 3,000 సంవత్సరాల పురాతన ముడమాల్‌ నిలువురాళ్లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే ముందుగా వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ తాత్కాలిక జాబితాలో చేర్చాలి.

New Update
Mudumal Megalithic Menhirs in Telangana

Mudumal Megalithic Menhirs in Telangana

తెలంగాణకు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణలోని నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలో 3,000 సంవత్సరాల పురాతన ముడమాల్‌ నిలువురాళ్లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే ముందుగా వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. తెలంగాణాలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశం ఒకటే ఉంది. అది రామప్ప ఆలయం.

ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

మొత్తం 62 ప్రదేశాలకు..

ఈ ఏడాది భారత్‌ చేర్చిన జాబితాలో చత్తీస్‌గఢ్‌లోని కంగెర్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్, తెలంగాణలోని ముడుమాల్‌ మెగాలితిక్‌ మెన్హిర్స్, పలు రాష్ట్రాల్లోని అశోకుడి శాసన స్థలాలు, మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్‌ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలోని బుందేలాల రాజభవనాలు, కోటలు ఉన్నాయి. వీటితో భారత్‌ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది.  

ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు