/rtv/media/media_files/2024/10/27/6uW0mQgYkxmlU2SowwVt.jpg)
TG News: హైదరాబాద్‌లోని ఒరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల నివాసం ఉంటున్న ఓరియన్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సోదాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా పలువురిని స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ వారెంట్ లేకుండా సోదాలు..
ఇక అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ ఎక్సైజ్ అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ప్రశ్నించగా.. న్యాయవాది సమక్షంలోనే తనిఖీలు చేస్తున్నామని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక విధులకు అటంకం కలిగించొద్దని పోలీసులు నచ్చజెప్పినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని రాజ్ పాకాల విల్లాలో విదేశీ మద్యం ఉందనే అనుమానంతో పోలీసులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజ్ పాకాల విల్లాకు తాళం వేసి ఉండటంతో.. అతడి సోదరుడు శైలేంద్ర పాకాల నివాసంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఓరియన్ విల్లాలో హైడ్రామా నెలకొంది.
MLC kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం... ఎమ్మెల్సీ కవిత సంచలనం!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.
kavitha-pawan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. దురదృష్టవశాత్తూ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారని.. చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్ట్ (బీజేపీ మద్దతుదారు) ఎలా అయ్యారని కవిత ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయన్న కవిత... రేపు తమిళనాడు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమనైనా ఆయన చెప్పొచ్చు అని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కల్యాణ్ అభిమానులు ఫైర్!
అయితే కవిత కామెంట్స్ పై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఊతికారేస్తున్నారు. కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Also read : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్
జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
Bandi sanjay : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్
Mahesh Babu: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్