నరేందర్ రెడ్డిని అలా ఎలా అరెస్ట్ చేస్తారు? పోలీసులకు హైకోర్టు షాక్!

వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఉగ్రవాది మాదిరిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏమైనా పరారీలో ఉన్నాడా? అని ప్రశ్నించింది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

New Update
Patnam Narender reddy

లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కేబీఆర్ పార్క్ వద్ద ఎందుకు ఆరెస్టు చేశాల్సి వచ్చిందని ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించింది. నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ప్రశ్నించింది. ఫోన్ కాల్స్ ఆధారంగా ఓ వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి: వారిని పక్కాగా ఊచలు లెక్కబెట్టిస్తా.. వరంగల్ లో రేవంత్ సంచలన స్పీచ్

అరెస్ట్ చేసే సమయంలో నరేందర్ రెడ్డి కుటుంబానికి సైతం సమాచారం ఇవ్వలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే.. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరో వైపు నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!

వికారాబాద్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్..

మరో వైపు తనకు బెయిల్ ఇవ్వాలని వికారాబాద్ జిల్లా కోర్టులో నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక నిందితుడైన బీఆర్ఎస్ యూత్ లీడర్ సురేష్ నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. తనకు ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని, ఇంటి నుంచి భోజనం అనుమతించాలని నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని, ఇంటి నుంచి భోజనం అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: ట్రాన్స్‌జెండర్లకు బిగ్ షాక్.. స్త్రీల బాత్‌రూమ్‌ల్లోకి నో ఎంట్రీ!

ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎన్ కౌంటర్.. 20 ఏళ్లకు చిక్కిన విక్రమ్ గౌడ!

Advertisment
Advertisment
తాజా కథనాలు