GROUP 1 Mains : గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెయిన్స్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి By V.J Reddy 15 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Group 1 Exam : తెలంగాణలోని గ్రూప్ - 1 అభ్యర్థులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల పై ధర్మసనం విచారణ చేపట్టింది. ఆ రెండు పిటిషన్లను కొట్టేసింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు పరీక్ష రద్దు కావడంతో తమ ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా! హాల్ టికెట్స్ విడుదల.... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ ఈ నెల 21 నుంచి... వీరందిరికీ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన! #telangana #group-1-mains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి