HYDRA: హైకోర్టు బిగ్‌ షాక్‌.. హైడ్రా ఆగిపోతుందా ?

ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాని ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్‌ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? అని ప్రశ్నలు సంధించింది. మరిన్ని వివరాలకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update

HYDRA: నిర్మించడానికి పర్మిషన్స్‌ ఇచ్చేది మీరే.. అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చేది మీరేనా? ఇదేం ప్రభుత్వ విధానం..? అసలు ఏ చట్టం ప్రకారం హైడ్రా ఈ పనులు చేస్తోంది? ఇవి హైడ్రా వ్యతిరేకవాదుల మాట కాదు.. సాక్ష్యాత్తు తెలంగాణ హైకోర్టు చెప్పిన మాటలు! హైడ్రా పేరిట రేవంత్‌ సర్కార్‌ కనబరుస్తున్న దూకుడుకు అడ్డుకట్ట పడేలా హైకోర్టు మొట్టికాయలు వేయడం ఇటు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా సెప్టెంబర్ 3న అమీన్‌పూర్‌లో షెడ్లను కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నా కూల్చివేశారని లక్ష్మీ అనే మహిళ హైకోర్టు గడపతొక్కారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ లక్ష్మణ్‌ ధర్మాసనం హైడ్రా పనితీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చిన తర్వాత కట్టిన భవనాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

హైడ్రా ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. జీహెచ్‌ఎంసీ చట్టం ఉండగా హైడ్రాకు అధికారాలు ఎలా కట్టబెడతారని ప్రశ్నించింది. ఇక ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాని ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్‌ సర్కార్‌కు ధర్మాసనం మొట్టికాయలు వేసింది. నిజానికి సినీ సెలబ్రెటిల నుంచి బడా రియల్టర్ల వరకు ఏ ఒక్కరిని వదల లేదు హైడ్రా! అయితే ఇటివలీ కాలంలో సామాన్యులకు కూడా హైడ్రాతో నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలా మందికి ఏదో బఫర్‌ జోనో కూడా తెలియదు. ఇళ్లు అమ్మేవాళ్లు ఇలాంటి విషయాలను చెప్పకుండా విక్రయిస్తారు. అందుకే అప్పోసప్పో చేసి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్న మిడిల్‌క్లాస్‌ ప్రజలు సైతం హైడ్రాకు భయపడుతున్నారు.

ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలివి. ఏ ఒక్కరిని హైడ్రా వదలకపోవడం మంచి విషయమే. అయితే అక్రమకట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలేవి? నిజానికి హైదరాబాద్‌లో భవనం కట్టాలంటే జీహెచ్‌ఎంసీ అనుమతి పొందాల్సిందే! దీనికి సంబంధించి ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ కూడా ఉంటుంది. అప్లికేషన్‌ సబ్మిట్‌ చేసుకున్న తర్వాత అనేక డాక్యూమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్ని వ్యాలిడ్‌గా ఉండాలి. డాక్యుమెంట్స్‌ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో అధికారులే చెక్ చేయాలి. ఆ తర్వాత టెక్నికల్ ఆఫీసర్‌ బిల్డింగ్‌ సైట్‌ను విజిట్ చేస్తారు. అప్పుడు అప్లికెంట్‌ సబ్మిట్‌ చేసిన డాక్యుమెంట్స్‌లో అన్ని నిజాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఆ తర్వాతే పర్మిషన్ ఇవ్వాలో లేదో అధికారులు ఓ నిర్ధారణకు వస్తారు. ఇదంతా బిల్డింగ్‌ నిర్మాణం కోసం అప్లై చేసిన ఏడు రోజుల్లో జరుగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు