High Court: ఫామ్ హౌజ్ కేసు.. రాజ్ పాకాలకు బిగ్ రిలీఫ్!

హైకోర్టులో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు ఊరట లభించింది. రాజ్‌ పాకాలను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది.

author-image
By Nikhil
New Update

హైకోర్టులో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు ఊరట లభించింది. రాజ్‌ పాకాలను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది. హైకోర్టులో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు ఊరట లభించింది. రాజ్‌ పాకాలను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది. పోలీసులు తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు.

Also Read :  కిరణ్ అబ్బవరం అంటే తమిళ స్టార్స్ భయపడుతున్నారా?

కేటీఆర్ బావమరిది కాబట్టే..

రాజ్ పాకాల తన ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వేరే వ్యక్తికి డ్రగ్ పాజిటివ్ వస్తే  రాజ్ పాకాల ను నిందితుడిగా చేర్చారన్నారు. డ్రగ్ టెస్ట్ కు శాంపుల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారన్నారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిదిని కాబట్టే టార్గెట్ చేశారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని వాదనలు వినిపించారు.

Also Read :  డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..

నిబంధనల ప్రకారమే నోటీసులు: ప్రభుత్వ న్యాయవాది

అయితే.. తాము అరెస్ట్ చేస్తామని ఎక్కడా చెప్పలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఇందులో రాజకీయ మోటివ్ లేదని స్పష్టం చేశారు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41A కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు. 

Also Read :  ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగితే ఇక అంతే

Also Read :  డబుల్ షాక్.. క్వాలిటీ టెస్ట్‌లో ఆ ట్యాబ్లెట్స్ ఫెయిల్..మొత్తం ఎన్నంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

సెంట్రల్ ఫోర్స్, పోలీసులు బచావో కర్రెగుట్టలు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడువులను ఆ రాష్ట్ర పోలీసులు, భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. తెలంగాణ సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్నారు.

New Update
maoist operation

మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్‌తో తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు ఎరుపెక్కాయి. చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని దండకార్యం అడవుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగం పీఎల్‌జీఏ లక్ష్యంగా పోలీసు బలగాలు బచావో కర్రెగుట్టలు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడువులను ఆ రాష్ట్ర పోలీసులు, భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి.  మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సెంట్రల్ ఫోర్స్ ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి మూడు రోజులుగా దూసుకెళ్తున్నాయి. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దాదాపు 100పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

 

బీజాపూర్ జిల్లా పూజారి కాంకేడ్ మీదుగా చొచ్చకెళ్తూ.. హిడ్మాను టార్గెట్ చేస్తూ మందుకు కదులుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో క్రమంగా మవోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోతున్నారు. కర్రెగుట్ట మీదుగా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర, కేంద్ర బలగాలు కర్రెగుట్టలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్రెగుట్టల ఆపరేషన్‌తో మాకు సంబంధం లేదని తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Also read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌ వైపు బీజాపుర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌ సరిహద్దులుగా సుమారు 90 కి.మీ. పొడవున గొలుసుకట్టుగా ఈ కొండలు విస్తరించి ఉన్నాయి. సముద్ర మట్టానికి సుమారు 9 వేల అడుగుల ఎత్తులో ఉండటంతోపాటు వీటిపైన దాదాపు 10-15 కి.మీ. మేర విస్తీర్ణం ఉండటంతో కొన్నేళ్లుగా మావోయిస్టులు స్థావరంగా మార్చుకున్నారు. సుమారు 1000 మంది పీఎల్‌జీఏ సభ్యులు ఇక్కడే ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. కేంద్ర కమిటీ అగ్రనాయకులు హిడ్మా, దేవ, వికాస్, దామోదర్‌ వంటి వారూ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 3 వేల మంది బలగాలు ఈ ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 

(maoist | telanagan | dandakaranyam | maoist commander hidma | Chattisgarh Naxal Attack | chattisghad | chattisgarh border | telugu-latest-news | Maoist Operation | Anti-Maoist Operation)

Advertisment
Advertisment
Advertisment