TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. ఆ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. ఖాళీలు, విద్యార్హతలు ఇవే!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీఓ21 జారీ విడుదల చేసింది.

New Update
assistant-professors-in-uni

assistant-professors-in-uni

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీఓ21 జారీ విడుదల చేసింది.  రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం రిలీజ్ చేశారు.  

కొత్త మార్గదర్శకాలకు ఆమోదం

అయితే గతంలో తీసుకువచ్చిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం రద్దు చేస్తూ కొత్త మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. మొత్తం మూడు దశల్లో రిక్రూట్ మెంట్ పూర్తిచేస్తారు. ప్రతీ యూనివర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి, రోస్టర్‌ విధానం, రిజర్వేషన్‌ విధానానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేస్తారు. దీనికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నాయకత్వం వహించాల్సి ఉంటుంది.  

మొదటి దశలో అకడమిక్‌ రికార్డ్, పరిశోధన ప్రదర్శనలకు సంబంధించి మొత్తం 50 మార్కులను కేటాయిస్తారు. యూనివర్సిటీ వీసీ, ఉన్నత విద్యా మండలి సబ్జెక్ట్‌ నిపుణుడు, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్, డిపార్ట్‌మెంట్‌ ముఖ్యుడు మార్కుల స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థికి సంబంధించి యూజీ నుంచి రీసెర్చ్‌ వరకూ వివిధ విద్యాస్థాయిల్లో మార్కులను ఖరారు చేస్తారు. మొత్తం వంద మార్కుల్లో ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. ఇక టీచింగ్‌ నైపుణ్యానికి 30 మార్కులు, మిగతా 50 మార్కులను యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ విభాగాల నుంచి అభ్యర్థి సాధించిన మార్కుల శాతం ఆధారంగా తీసుకుంటారు.

నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్స్‌కు 30 మార్కులు ఇస్తారు. ఈ మార్కులను టీచింగ్, బుక్‌ ఆథర్‌షిప్, జాయింట్‌ ఆథర్‌ షిప్, ఎడిట్‌ ఆథర్‌షిప్, కో–ఎడిటర్‌ ఆథర్‌షిప్, పోస్టు–డాక్టోరల్‌ షిప్‌గా విడగొడతారు. ఈ మార్కులను ఆయా సబ్జెక్టు లెక్చరర్లు పరిశీలించి, నిర్ణయిస్తారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఇస్తారు. ఇందులో సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్, ఓవరాల్‌ పర్సనాలిటీ, నైపుణ్యాన్ని బట్టి మార్కులు వేయడం జరుగుతోంది.  రిక్రూట్ మెంట్ ప్రక్రియకు రేవంత్  ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలపడంతో వర్సిటీలకు 12 సంవత్సరాలుగా ఉన్న సమస్య  త్వరలో తీరనుంది.  

Also Read :  Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment