TG Govt: సొంత ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం TG: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు. By V.J Reddy 05 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డు తప్పనిసరి అని అవుతుందని తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా రేషన్ కార్డు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు వస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం వచ్చే నెలలో రేషన్ కార్డులు... ! తెలంగాణలో రేషన్ కార్డు కోసం ఎదురుచూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ప్రజ పాలన కార్యక్రమం కింద ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా వచ్చిన దరఖాస్తులలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు కోసం చేసుకున్న వారే ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే మంత్రి పొంగులేటి కొత్త రేషన్ కార్డుల జారీపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కొత్త రేషన్ కార్డులను త్వరలోనే జారీ చేయనున్నట్లు చెప్పారు. Also Read : గుజరాత్‌లో దారుణం.. ఊపిరాడక కారులో నలుగురు చిన్నారులు ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం అయ్యాయని అన్నారు. డిజిటల్ హెల్త్ కార్డు కార్యక్రమంతో పాటు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని అన్నారు. పల్లెలలో నివాసం ఉంటున్న వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు తదితర పింఛనుకు అర్హులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన వారు ఎంతమంది ఉన్నా పింఛను ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాగా అనర్హులైన వారికి ఒక్కరికి పింఛను ఇచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులను మంత్రి హెచ్చరించారు. Also Read : ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM.. Also Read : త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే? . #revanth-reddy #telangana-government #indiramma housing scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి