/rtv/media/media_files/2025/03/13/gi4pGlZH1jtpO9yfJ6aP.jpg)
బీటెక్ చదివే విద్యార్థులకు ఇది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. తెలంగాణలో వచ్చే అకాడమిక్ ఇయర్ (2025-2026)లో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయి. కొన్ని కాలేజీల్లో అయితే ఫీజులు ఏకంగా ఢబుల్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్ కమిషన్ (TAFRC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీబీఐటీ, వీఎన్‌ఆర్, వాసవి, ఎంజీఐటీలాంటి కొన్ని కాలేజీల్లో 50% వరకు పెంపును ప్రతిపాదించింది. సీబీఐటీలో ఫీజు రూ.1.65 లక్షలు ఉండగా ఏకంగా రూ.2.40 లక్షలకు పెరగనుంది. ఇప్పటి వరకు ఈ కాలేజీలో ఇంజనీరింగ్ ఫీజు ఏడాదికి రూ.1.65లక్షలు ఉండగా ఇప్పడదీ ఏకంగా రూ.53 వేలు పెంచేయటం గమనార్హం. ఇక బాచుపల్లికి లోని వీఎన్ఆర్ కాలేజీలో ఇప్పటివరకు ఇంజనీరింగ్ ఫీజు ఏడాదికి రూ.1.35 లక్షల చొప్పున వసూలు చేస్తుండగా.. దాని ఫీజును తాజాగా రూ.2.20 లక్షలకు పెంచేస్తూ అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వ అనుమతిని కోరారు.
Also read : హోలీ ఎఫెక్ట్ మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు
Also read : తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ ముఖ్య సమాచారం.. ఇక ఎండ దంచుడే దంచుడు!
మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు
దాదాపుగా రాష్ట్రంలో ఇదే అత్యధిక ఫీజు. కాలేజీల నిర్వహణ, ప్రొఫెసర్ల జీతాలు, సదుపాయాలను పరిశీలించి టీఏఎఫ్‌ఆర్సీ ఫీజుల పెంపును ప్రతిపాదిస్తుంది. ప్రభుత్వం వాటిని పరిశీలించి జీవో జారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజులు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తే.. పునఃసమీక్ష చేయాలని సూచించే అవకాశం ఉంటుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా.. ఇందులో 19 ప్రభుత్వ, 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఇందులోఈ సారి 60 పైగా కాలేజీల్లో రూ.2 లక్షల వరకు ఫీజులు పెంచనున్నారు. మిగతా కాలేజీల్లో రూ.50 వేలకు వరకు పెరుగనున్నట్లుగా సమాచారం. పెంచిన ఫీజులు వచ్చే సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి.
Also read : పాక్ ఆటగాళ్లకు బిగ్ షాక్.. 75 శాతం ఫీజుల్లో కోత విధించిన బోర్డు!