రేవంత్ పాలనలో క్షీణించిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు.. హరీష్ రావు ఫైర్

సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు క్షీణించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిలోపే రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు. ఈ సర్కారు ఉత్త బేకార్ గా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

author-image
By srinivas
New Update
harish raooo

Harish rao: సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు క్షీణించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిలోపే రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు. ఈ సర్కారు ఉత్త బేకార్ గా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ మేరకు నీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలి కానీ నువ్వు కాదు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. నీ అపరిపక్వత, నీ అసమర్థత, నీ ప్రతికూల వైఖరి వల్ల రాష్ట్రంలో నేడు అన్ని రంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ వర్గం కాంగ్రెస్ పాలనను మెచ్చుకునే పరిస్థితి లేదు. ఇది గమణించిన ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నడని సెటైర్ వేశారు. 

ఏడు లక్షల కోట్ల అప్పు..

ముఖ్యమంత్రి మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నాడు. మేము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నవు. ఆడరాక మద్దెల ఓడు అనే సామెతకు నీ మాటల్ని మించిన నిదర్శనం లేదు. ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తుశుద్ది లేదు. ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ము లేదు. కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లాగ ఉంది. ఏడు లక్షల కోట్ల అప్పు అని ఏడాది కాలం నుంచి చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెబుతున్నవు. అబద్దాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటరు. గోబెల్స్ ను మించిన రేబెల్స్ ప్రచారం నీది. గత ప్రభుత్వం దాచిందని అసత్య ప్రచారం చేస్తున్నావు. ప్రభుత్వం అట్ల దాచే అవకాశమే ఉండదు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 

NOTE అని పెట్టి.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15 వేలు ఇస్తామని చెప్పిన విషయం. నీకు గుర్తు లేకపోవచ్చు రేవంత్ రెడ్డి. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి." అని తన ట్వీట్ లో హరీష్ రావు రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు