తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్‌ రిజల్ట్స్‌!

డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgdsc.aptonline.in/tgdsc/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. గత ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

author-image
By B Aravind
New Update
TS DSC Results

డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగాయి. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈసారి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ లింక్ https://tgdsc.aptonline.in/tgdsc/ లోకి వెళ్లండి.

Also Read :  కంగనా కొత్త కారు ధర తెలిస్తే మైండ్ బ్లాకే.. ఏకంగా బంగ్లాను అమ్మేసి కొనుగోలు చేసిందిగా..!

ప్రస్తుతం DSC జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయగా.. రేపు జిల్లాలకు జాబితా రానుంది. ఇక వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. ఇప్పుడు విడుదల చేసిన ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటుంది. తర్వాత జిల్లాల వారిగా సెలెక్టడ్ లిస్టును డీఈవోలకు అందిస్తారని అధికారులు తెలిపారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం.. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారిగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్‌ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్‌ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తోంది. అయితే గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్‌ ఎదుటు స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరు కింద పడ్డారు. ఆ మహిళ తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

ఇటీవలే హైదరాబాద్‌లోని ఇలాంటి ఘటనే జరిగింది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ ఓ వాహనాదారుడు మృతి చెందాడు. ఈనెల 13వ తేదీన ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

 rtc-bus | telugu-news | telangana | hyderabad 

Advertisment
Advertisment
Advertisment