TG Congress Politics: మీనాక్షికి బిగ్ షాక్ ఇచ్చిన సీనియర్లు.. హైకమాండ్ కు కంప్లైంట్!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ ఫిర్యాదు చేశారు.

New Update

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు సీనియర్ నేతలు బిగ్‌షాక్ ఇచ్చారు. ఆమెను తొలగించాలంటూ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆమె వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందంటూ హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ను ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా? అన్న అంశం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. HCU భూముల విషయంలో మీనాక్షి నటరాజన్ ఏకంగా సెక్రటేరియట్లోని భట్టి విక్రమార్క ఛాంబర్ లో సమీక్ష నిర్వహించిన అంశంపై విమర్శలు వచ్చాయి. అనంతరం యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్ తో భేట కావడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. 

అందుకే సీనియర్లకు కోపం?

పార్టీలో అందరూ ఒకటే అనే సిద్ధాంతంతో మీనాక్షి పని చేస్తున్నారు. ఇది సీనియర్లకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. తమ సిఫారసులను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ టీమ్ లో మీనాక్షి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం ఉంది.

ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయడం అన్న లక్ష్యంగా మీనాక్సి నటరాజన్ ను తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది హైకామాండ్. అయితే.. ప్రస్తుతం సీనియర్లు ఆగ్రహంగా ఉన్న ఈ తరుణంలో ఆమెను కొనసాగిస్తారా? లేక పక్కకు పెడతారా? అన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది.

(telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment