Addanki Dayakar: ఎమ్మెల్యే సామేలుకు చెక్.. దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డితో అద్దంకి భేటీ అందుకేనా?

కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ ఈ రోజు నల్లగొండ కీలక నేతలు దామోదర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యే సామేలుకు చెక్ పెడుతూ.. తుంగతుర్తి పాలిటిక్స్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకే దయాకర్ వీరిని కలిశారా? అన్న ప్రచారం మొదలైంది.

New Update
Addanki Dayakar

Addanki Dayakar

అద్దంకి దయాకర్.. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు చాలా పాపులర్. సామాజిక ఉద్యమాల నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నేత.. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి బలమైన గొంతుగా మారారు. వేలాది టీవీ చర్చలు, ప్రెస్ మీట్ల ద్వారా పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషిని ఆయనను వ్యతిరేకించేవారు సైతం కాదనలేరు. 2014, 18 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దయాకర్.. ఈ రెండు సార్లు కూడా కేవలం రెండు వేల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అయితే.. గత ఎన్నికల్లో పార్టీలో వర్గ విభేదాల కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా ఆయన ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీ గెలుపు కోసం పని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దయాకర్ కు సముచిత స్థానం కల్పిస్తామని అగ్రనేతలు ఆ సమయంలో హామీ ఇచ్చారు.

ఏడాది దాటినా దక్కని పదవి..

పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత దయాకర్ కు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. మంత్రి పదవి కూడా ఇచ్చి.. విద్యాశాఖను కూడా కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బల్మూర్ వెంకట్ కు ఎమ్మెల్సీ ఇచ్చిన సమయంలో దయాకర్ పేరు సైతం ఖారారైందన్న వార్తలు వినిపించాయి. కానీ ఆఖరి నిమిషంలో ఆయనకు బదులుగా మహేశ్ కుమార్ గౌడ్ కు అవకాశం దక్కింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అద్దంకికి వరంగల్ ఎంపీగా అవకాశం వస్తుందంటూ మీడియా కోడై కూసింది. కానీ.. ఆ ఛాన్స్ కూడా దక్కలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అద్దంకికి ఎలాంటి పదవి రాకపోవడంతో ఆయన వర్గీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అద్దంకి పేరును కాంగ్రెస్ మరిచిపోయిందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. 

ఒకే రోజు ఇద్దరు కీలక నేతలతో భేటీ!

అయితే.. ఈ రోజు కొద్ది గంటల వ్యవధితోనే అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బలమైన కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంలో బలమైన అనుచరగణం కలిగిన దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తో దయాకర్ కు గతంలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరే దయాకర్ కు టికెట్ దక్కకుండా అడ్డుపడ్డారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు దయాకర్ కు ఏ అవకాశం రాకుండా వీరే చక్రం తిప్పుతున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. దీంతో వీరితో సయోధ్య కుదుర్చుకునేందుకు దయాకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దామోదర్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డిని కలిసినట్లు చర్చ సాగుతోంది.  

మళ్లీ తుంగతుర్తిలోకి ఎంట్రీ?

ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్న మందుల సామేల్ కు, దామోదర్ రెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. తుంగతుర్తి నియోజకవర్గంతో తన కుమారుడు సర్వోత్తమ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజదర్బార్ నిర్వహిస్తామని దామోదర్ రెడ్డి గతంలో సంచలన ప్రకటన చేశారు. సామేలుకు వ్యతిరేక వర్గం తలపెట్టిన మీటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలనే అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించడం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా సామేలు ప్రవర్తన కోమటిరెడ్డి బ్రదర్స్ కు కూడా మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సామేలుకు చెక్ పెట్టేందుకు మళ్లీ దయాకర్ ను తెరపైకి తెచ్చారా? అన్న విశ్లేషణలు సైతం నల్లగొండ పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి.

కేవలం సయోధ్య కోసమే దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దయాకర్ కలిశారా? లేక తుంగతుర్తి పాలిటిక్స్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే సామేలుకు ఝులక్ ఇస్తారా? అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment