Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్!

సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు మంత్రి సురేఖ కలిశారు. అనవసర వివాదాల జోలికి పోవొద్దని సురేఖకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలా జరిగితే బాగుండదంటూ సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

New Update

వరుస వివాదాల అనంతరం మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. సీఎం ఆదేశాలతోనే ఈ రోజు సురేఖ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రేవంత్ రెడ్డి సురేఖకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కా తొందరపడకు.. కొంచెం స్పీడ్ తగ్గించు అని చెప్పినట్లు సమాచారం. నాగార్జున ఫ్యామిలీ, సమంత విడాకుల అంశంపై చేసిన కామెంట్స్ ను రేవంత్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని వివరించినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి: మేడిగడ్డపై రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్!

నేను ఇబ్బంది పడుతున్నా..

మీ వ్యాఖ్యల వల్ల నేను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని సురేఖతో రేవంత్ అన్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ కూడా సీరియస్ అయిన విషయాన్ని సురేఖకు చెప్పినట్లు సమాచారం. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని స్పష్టం చేసినట్లు చర్చ సాగుతోంది. పరకాల నియోజకవర్గంలో వర్గ విభేదాలపై కూడా రేవంత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ కుర్చీలో కూర్చొని వార్నింగ్ ఇవ్వడంపై ఫైర్ అయినట్లు సమాచారం. ఇలాంటి ఘటనల ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Yadadri : యాదాద్రి లడ్డూ క్వాలిటీ.. ల్యాబ్ రిపోర్ట్ లో ఏం తేలిందంటే?

ఎమ్మెల్యే పనుల్లో వేలు పెట్టొద్దు..

అక్కడ ఎమ్మెల్యే పనుల్లో వేలు పెట్టవద్దని రేవంత్ అన్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన వద్దకు రావాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అనంతరం నేడు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డితో కలిసి సురేఖ నివాళులర్పించారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

ఇది కూడా చదవండి: DSC 2024: టీచర్ నియామకాల్లో బయటపడ్డ ఫేక్ సర్టిఫికేట్లు.. వారికి షాక్!

ఇది కూడా చదవండి: తగ్గేదేలేదంటున్న కొండా సురేఖ.. వేములవాడలో మరో వివాదం!

Advertisment
Advertisment
తాజా కథనాలు