Telangana : గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..గంటకు పైగా చర్చ !

సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంటకు పైగా గవర్నర్ తో సీఎం చర్చించారు. ఈ భేటీలో సీఎం మంత్రివర్గ విస్తరణపై ప్రముఖంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.

author-image
By Krishna
New Update
cm-revanth-reddy meets varma

cm-revanth-reddy meets varma

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంటకు పైగా గవర్నర్ తో సీఎం చర్చించారు. ఈ భేటీలో సీఎం మంత్రివర్గ విస్తరణపై ప్రముఖంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం వెంట మంత్రి కొండా సురేఖ కూడా తదితరులు ఉన్నారు.  ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్‌లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం.  దీనిపై త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.  

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

ప్రతి సంకల్పం నెరవేరింది

జీవితంలో తాను తీసుకున్న ప్రతి సంకల్పం నెరవేరిందని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు.  ఉగాది వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం..  తాను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమూనా అవుతుందని తెలిపారు. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. అభివృద్ధి జరిగినప్పుడు అడ్డంకులొస్తాయని.... అలాగని ఆగిపోకుండా అందరి సహకారం తీసుకుంటామని తెలిపారు. దేవుళ్లనే నూటికి నూరు శాతం ఆమోదించడం లేదని సీఎం అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.  భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ షడ్రుచుల కలయికలా ఉందని వెల్లడించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anugula Rakesh Reddy : ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తా….రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం నోటీసులు జారీ చేసింది. స్పందించిన రాకేష్ రెడ్డి అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానన్నారు.

New Update
Anugula Rakesh Reddy

Anugula Rakesh Reddy

Anugula Rakesh Reddy : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ(TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో స్పందించిన రాకేష్ రెడ్డి అంతే గాటుగా సమాధానమిచ్చారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..టీజీపీఎస్సీ నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తానని అన్నారు. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ సందర్భంగా ఆయన.. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానని అన్నారు. జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి గారు పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డను తనని, ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గ్రూప్ -1 పరీక్షల్లో జరిగిన అవకతవలకు పై ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని సహేతుకంగా ప్రశ్నించినందుకు నాపై పరువునష్టం దావా వేశారని తెలిపారు. ప్రశ్నిస్తేనే మీ పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలి? అని సూటిగా ప్రశ్నించారు. అంతేగాక గతంలో నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే టీఎస్‌పీఎస్సీ పైన రోడ్డెక్కి ఎన్నో విమర్శలు చేశారని, మరి అప్పుడెందుకు ఇలాంటి నోటీసులు ఇవ్వలేదు..? అని నిలదీశారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

 బీఆర్ఎస్ పార్టీకి, నాయకత్వానికి కేసులు కొత్తకాదు.. పోరాటం కొత్తకాదు.. ఆ స్ఫూర్తితోనే విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతామని, మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తాను అని రాకేష్ రెడ్డి రాసుకొచ్చారు. కాగా ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణలపై సీరియస్ అయిన టీజీపీఎస్సీ రాకేష్ రెడ్డి‌కి నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, లేకుంటే పరువు నష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.ఇకపై భవిష్యత్తులో టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.

Also Read: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!

Advertisment
Advertisment
Advertisment