/rtv/media/media_files/2025/02/17/2mopN7dt2KFwh5WbqXvN.jpg)
Telangana New Ration Cards
కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల మంజూరుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలంగాణకు బీసీ సీఎం.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!
పౌర సరఫరాల శాఖ పై సమీక్ష నిర్వహించడం జరిగింది.
— Revanth Reddy (@revanth_anumula) February 17, 2025
కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయవలసిన అవసరం లేకుండా అవగాహన కల్పించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు… pic.twitter.com/02yDd5dtM5
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్.. ఏం అన్నారంటే!
ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈసీ ఆయా జిల్లాల్లో కోడ్ అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కేవలం రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే కోడ్ అమల్లో లేదు. దీంతో ఈ జిల్లాల్లో మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేసే ఛాన్స్ ఉంది.