తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తూనే, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధాని పదవి చేపట్టాలని తానే స్వయంగా ఒప్పించినట్లు రేవంత్ వెల్లడించారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలనే లక్ష్యం ఉంది తప్ప, ప్రధాని కావాలనే ఆశ లేదని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే ఉంటారని, ముందుగా కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రకటించి ఆ తర్వాత కూటమిలోని మిగిలిన పార్టీలను ఒప్పిస్తుందని చెప్పారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తా
2034 వరకు తాను తెలంగాణలోనే ఉంటానని, ఇక్కడి ప్రజల కోసమే పనిచేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. దేశ జీడీపీలో 10 శాతం వాటా తెలంగాణ నుండే వచ్చేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని లక్ష్యాన్ని ప్రకటించారు. 2034 తర్వాత తాను సీఎంగా ఉండనని, ఆ తర్వాత వచ్చే కొత్త తరానికి అవకాశం ఇస్తానని చెప్పారు. అప్పుడు దేశ సేవలో భాగస్వామిని అవుతానని, తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి, ఆయన ఇచ్చిన కుర్చీలో నేను కూర్చుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు.
గాంధీ కుటుంబానికి దేశం పట్ల అపారమైన విశ్వాసం ఉందని, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో తనకు మంచి చొరవ ఉందని చెప్పారు. అయితే, ఎప్పుడూ తన పరిమితులు దాటి ప్రవర్తించనని అన్నారు.
తెలుగుదేశం పార్టీలో 10 ఏళ్లు పనిచేశానని, పార్టీ మారే సమయంలో విజయవాడ వెళ్లి చంద్రబాబుకు చెప్పి మరీ వచ్చానని రేవంత్ గుర్తు చేసుకున్నారు. పార్టీ వదిలిన తర్వాత కూడా నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉండటం అరుదని, చంద్రబాబు ఇప్పటికీ తనను గౌరవిస్తారని చెప్పారు.
Telangana : 2034 వరకు నేనే సీఎంను.. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తూనే, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు.