/rtv/media/media_files/2025/11/09/cm-revanth-reddy-2025-11-09-12-31-14.jpg)
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సూపర్ స్కీమ్‌ను ప్రకటించారు. సర్కారు బడి పిల్లలకు త్వరలోనే ఉచితంగా స్కూల్ బస్ సదుపాయం కల్పించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. దీనివల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ప్రయాణ ఇబ్బందులు తప్పుతాయి. ఈ ఉచిత బస్సులతో పాటు, చదువులో వెనుకబడిన పేద విద్యార్థుల కోసం అవసరమైన ప్రాంతాల్లో ఉచితంగా ట్యూషన్స్ కూడా చెప్పించేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే స్కూళ్లలో చదువుల నాణ్యతను పెంచేందుకు వీలుగా పాఠశాలలను రేషనలైజ్ చేయనున్నారు. ఇకపై ప్రతి క్లాస్ రూమ్‌లో కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా పక్కా చర్యలు తీసుకోనున్నారు. క్లాసులో పిల్లల సంఖ్య పరిమితంగా ఉంటే టీచర్లు ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి లో నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Follow Us