/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-07-07-45.jpg)
Telangana Class 10th Exam Results Released
10th class Results 2026 : తెలంగాణ పదో తరగతి (SSC) విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీతో ముగిశాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, జవాబు పత్రాల మూల్యాంకనం (Spot Valuation) ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభమై, ఏప్రిల్ 25 నాటికి విజయవంతంగా పూర్తయ్యింది. అనంతరం మార్కుల క్రోడీకరణ (Tabulation) ,స్కానింగ్ ప్రక్రియను బోర్డు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఎక్కడా ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ, అనుకున్న సమయం కంటే ముందే ఫలితాలను వెల్లడించింది.
ఫలితాలు ఇలా తెలుసుకోండి
ఈ ఏడాది విద్యార్థుల కోసం ఎస్సెస్సీ బోర్డు ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణ వెబ్‌సైట్‌లతో పాటుగా, విద్యార్థులు తమ ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా సులభంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.ముందుగా 80969 58096 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.వాట్సాప్‌లో ఆ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపాలి. అనంతరం 'SSC Results' అని టైప్ చేసి, విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేయాలి. వెంటనే ఫలితాలు మీ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లోనూ చూసుకోవచ్చు.
Follow Us