తెలంగాణలో బీజేపీకి కొత్త రథసారథి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం భారీ సంఖ్యలో ఆశావాహులు పోటీపడుతున్నప్పటికీ ఇద్దరి పేర్లను బీజేపీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు డిసెంబర్ 10 నుంచి 20 వరకు మండల కమిటీలు పూర్తి చేయాలనే భావిస్తున్న బీజేపీ.. ఈ ప్రక్రియ పూర్తికాగానే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనుంది. అయితే ఈ పదవి కోసం ఇప్పటికే ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లు పోటీపడుతుండగా తాజాగా రాజాసింగ్, పాయల్ శంకర్ సైతం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా ఢిల్లీ వేదికగా లాబీయింగ్ చేపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. Also Read: చిన్న చిట్కాలతో భయంకరమైన పీరియడ్స్ నొప్పి మాయం బీసీ సామాజిక వర్గానికే.. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పీఠం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుండగా ఎంపీ ఈటల రాజేందర్‌కు అధ్యక్షపీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు ఉండటంతో మరింత బలం చేకూరింది. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న అరుణ.. కేబినెట్‌లో చోటు కోసం లాబీయింగ్ కు పాల్పడ్డప్పటికీ అవకాశం రాకపోవడంతో కనీసం బీజేపీ చీఫ్ పదవి అయినా దక్కుతుందనే ఆశతో ఉన్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: TG: తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం 'మైత్రి ట్రాన్స్ క్లినిక్స్' జాతీయ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్ని రాష్ర్టా్ల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ సంస్థాగత ఎన్నికల ఏర్పాట్లలో యెండల లక్ష్మీనారాయణ నిమగ్నమయ్యారు. ఇటీవలే ఆయన బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 16 నుంచి 30 వరకు బూత్ కమిటీలను పూర్తిచేయనున్నారు. బూత్ కమిటీలు పూర్తకాగానే ఢిల్లీలో అన్ని రాష్ర్టాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో అధిష్టానం సమావేశం నిర్వహించి మండల, జిల్లా, రాష్ర్ట కమిటీలపై మార్దనిర్దేశం చేయనున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21న జాతీయ, 27న రాష్ట్ర, డిసెంబర్ 20న జిల్లాస్థాయిలో కార్యశాలలను నిర్వహించనున్నారు. తర్వాత మండల, జిల్లా కమిటీల నిర్మాణం పూర్తయ్యాక రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఇది కూడా చదవండి: పార్లమెంట్‌లో ప్రియాంక సీటు నెంబర్ ఫిక్స్.. ఆయన పక్కనే! Also Read: గదిలో ఈ వస్తువులుంటే జాగ్రత్త.. లేకపోతే ప్రాణాంతకం జరగవచ్చు