/rtv/media/media_files/2025/03/20/cW8RqJKcfeL2NtJbCIio.jpg)
BJP MP Raghunandan Rao
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనియాంశమైంది. రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి రాబోతోందని పార్టీ నుంచి సమాచారం వచ్చిందా? ఈ నేపథ్యంలోనే మోదీని మర్యాదపూర్వకంగా కలిశారా? అన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping Case : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
Truly humbled and grateful!! Had the honor of spending quality time with Hon'ble PM @NarendraModi ji along with my family. This unforgettable moment will always be cherished. pic.twitter.com/eaf9ga6w7k
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) March 20, 2025
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరు అవుతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న ప్రచారం సాగుతోంది. అయితే బీసీ నేపథ్యంలో ఈటలకు ఎక్కువ ఛాన్స్ ఉందని కొన్ని రోజులు గా వార్తలు వినిపించాయి.
ఇది కూడా చదవండి: Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!
ఇటీవల ప్రధానికి కలిసిన ఈటల ఫ్యామిలీ..
ఈటల రాజేందర్ సైతం ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఒకటి రెండ్రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని.. అందుకు ఈటల ప్రధానిని కలిశారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రకటన ఇంత వరకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సైతం కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీనిని కలవడం చర్చనీయాంశమైంది.