/rtv/media/media_files/2025/03/11/ir2DYSRnkbX4kXZ72pNS.jpg)
Telangana Assembly
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చా కార్యక్రమం నేడు జరగనుంది. ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై మాట్లాడారు.ఈరోజు ముఖ్యమంత్రి ప్రసంగంతో పాటు గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే చర్చలో అన్ని పక్షాల నేతలు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరినీ అనుమతి లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లోకి కూడా రానివ్వడం లేదు. ఎలాంటి ఆందోళనలకు, ర్యాలీలకు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?
కాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలిలో ఈరోజు ప్రశ్నోత్తరాలతో సభలు ప్రారంభం కానున్నాయి. శాసనమండలిలో ఈరోజు కేవలం ప్రశ్నోత్తరాల వరకే బిజినెస్ పరిమితం చేశారు.ప్రభుత్వ పథకాల అమలు, కళ్యాణమస్తు పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీ కోసం భూసేకరణ, రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, వరి ధాన్యానికి బోనస్, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, వరి ధాన్యం సేకరణ, తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి సరఫరా తదితర ప్రశ్నలు మండలిలో చర్చకు రానున్నాయి.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
ఇక శాసనసభలో మెస్ డైట్ చార్జీల పెంపు, జాతీయ రహదారుల సమీపంలో ట్రామా కేర్ కేంద్రాలు, విదేశీ ఉపకార వేతనాల చెల్లింపులో జాప్యం, కామారెడ్డి జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి, దేవాలయ పర్యాటకం, పర్యావరణ పర్యాటకాల ప్రోత్సాహం, శంకరపట్నం మండలంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ప్రభుత్వ వెబ్ సైట్లో జీవోలు, సర్కులర్లు, హెచ్ఎండిఏ భూముల తాకట్టు, మహబూబాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు కోసం నిధులు, టీ-ఫ్రైడ్ కింద రాయితీ తదితర అంశాలున్నాయి.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
తెలంగాణ శాసనసభలో ప్రతిష్టాత్మకమైన 5 బిల్లులను ప్రవేశపెట్ట నున్నారు. వాటిలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రేషనల్లైజేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. తెలంగాణ చారిటబుల్, మరియు హిందూ సంస్థల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సభలో చర్చించి ఆ తర్వాత ఆమోదం కోసం కోరనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లును సభలో చర్చకు పెట్టి ఆమోదం కోసం కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!