తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు

తెలుగు రాష్టాల్లో స్వల్పంగా భూప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:26 నిమిషాల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, చింతకాని, నాగులవంచ, మధిర, కొత్తగూడెం, టేకులపల్లి మణుగూరు, భద్రాచలం, ములుగు, చర్ల, కరీంనగర్, వరంగల్, హన్ముకొండ, దుమ్ముగూడెంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరులో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. అలాగే హైదరాబాద్‌లో  వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో భూకంపం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:  అమరావతిలో ఐదెకరాలు కొన్న సీఎం చంద్రబాబు

స్వల్పంగా భూమి కంపించడంతో..

భూకంపం ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం 7:26 నిమిషాల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయపడి వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: పెళ్లికి నిరాకరించడంతో యువతి మనస్తాపంతో.. ఏం చేసిందంటే?

 

ఇది కూడా చూడండి: వరద బీభత్సం.. 30 మందికి పైగా మృతి

 

ఇది కూడా చూడండి:  మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment